Google
    Nagarjuna Damarukam will hit screens soon :: Daruvu ready to hit the screens on May 25th :: Naga Chaitanya and Sunil will be seen as brothers :: Ravi Teja DCM to be shot in Italy :: Huge set for Allari Naresh duet.

అలా మొదలైంది” చిత్రంతో కెరీర్ ఆరంభించిన అందాల భామ నిత్యా మీనన్ మొదటి చిత్రంతోనే మంచి నటిగా, అందగత్తెగా మంచి మార్కులు పడ్డాయి. “అలా మొదలైంది” సూపర్ హిట్టవ్వడంతో ఆమె ఇప్పుడు అందరికీ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది.


యాక్టింగ్, డబ్బింగ్, సింగింగ్ టాలెంట్స్ ఉండడంతో, నిత్యామీనన్‌కి టాలీవుడ్ బ్రహ్మరధం పట్టేలా ఉంది. తాజాగా వెంకటేష్ సరసన ఓ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది నిత్యా మీనన్. టాలీవుడ్ టాప్ స్టార్స్ ఒకరైన వెంకటేష్ సరసన నటించే ఛాన్స్ తనకు లభించినందుకు నిత్యామీనన్ ఉబ్బితబ్బివుతోంది.

ఇప్పుడు కుర్ర హీరోలు సైతం తన కోసం క్యూ కట్టేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.  నిత్యామీనన్ కోసం ఎన్టీఆర్ వాకబు చేసాడనే సమాచారం అందుతోంది. ఇప్పుటికిప్పుడు నిత్యామీనన్ చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. దీనిని బట్టి ఆమెకు టాలీవుడ్‌లో ఎంత క్రేజ్ ఉన్నదనేది మనం అర్ధం చేసుకోవచ్చు.

తెలుగులో ఈ రేంజ్ పాపులారిటీ తాను ఊహించలేదంటోన్న నిత్యామీనన్. హిట్ దొరకడం కన్నా, హిట్టొచ్చాక దాన్ని నిలబెట్టుకోవడమే కష్టమనీ, కెరీర్‌ని పక్కగా ప్లాన్ చేసుకున్నానని, టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదుగుతానని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Mega World News Facebook Twitter Myspace Friendfeed Technorati del.icio.us Digg Google Yahoo Buzz StumbleUpon Weekend Joy